ప్రేమించినవాడు కాదన్నాడని... | Degree Student Committed Suicide Due To Love Failure In Medchal | Sakshi
Sakshi News home page

ప్రేమించినవాడు పెళ్లికి నిరాకరించడంతో..

Feb 21 2019 4:45 PM | Updated on Feb 21 2019 5:00 PM

Degree Student Committed Suicide Due To Love Failure In Medchal - Sakshi

పెళ్లి చేసుకోవడానికి నవీన్‌ నిరాకరించడంతోనే దివ్య ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, మేడ్చల్‌ : డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల విహార్‌ కాలనీలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన పైళ్ల దివ్య (20)..  అదే గ్రామానికి చెందిన బుగ్గ నవీన్‌ (23)ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. తల్లిదండ్రులతో కలిసి విహార్‌ కాలనీలో నివాసముంటున్న ఆమె నిన్న రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవడానికి నవీన్‌ నిరాకరించడంతోనే దివ్య ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement