కిడ్నీకి రూ. కోటి పేరుతో యువతిని దోచేశారు

Cyber ​​Criminals Who Cheated Young Woman In Karnataka - Sakshi

యువతిని మోసగించిన సైబర్‌ నేరగాళ్లు 

ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుదామని నిలువునా నష్టపోయిన బ్యాంకు ఉద్యోగిని 

కొత్త పంథాలో సైబర్‌ కీచకుల ప్రకటనలు 

సాక్షి, కర్ణాటక: మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. కుటుంబ సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో కిడ్నీ విక్రయానికి పెట్టిన 24 ఏళ్ల యువతిని సైబర్‌ కీచకులు నిలువునా మోసగించారు. దీంతో బాధిత యువతి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై హడాపింగ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.  

ఆర్థిక సమస్యలు తొలగించుకోవాలని: 
తల్లిదండ్రులతో బెంగళూరులో నివాసం ఉంటున్న యువతి బ్యాంకు ఉద్యోగిని. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటిని నుంచి గట్టెక్కడానికి యువతి ప్రయత్నాలు చేపట్టింది. ఓ సోషల్‌ మీడియాలో కిడ్నీ దానం చేస్తే రూ. కోటి ఇస్తామనే ప్రకటన గమనించి అక్కడి ఫోన్‌ నెంబర్‌లో విచారణ చేసింది. సైబర్‌ వంచకుడు యువతికి తిరిగి ఫోన్‌ చేసి కిడ్నీ ఇవ్వాలనుకుంటే మొదట కొంత ఫీజు చెల్లించాలని సూచించాడు. పోలీస్‌ సర్టిఫికెట్‌ ఇతరత్రా వాటికి ముందు నగదు చెల్లిస్తే అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని వంచక ముఠా యువతికి సూచించింది. వీరి మాటలు నమ్మిన యువతి కిడ్నీ ఇవ్వడానికి సమ్మతించి దశల వారీగా వారి వంచకులకు రూ. 3.14 లక్షలు చెల్లించింది. తిరిగి వంచకులు యువతిని నగదు అడగడంతో ఆమెకు అనుమానం రావడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు.  చదవండి: బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం

బంగారు ఆభరణాలు విక్రయించి... 
లాక్‌ డౌన్‌ సమయంలో బ్యాంకులు పనిచేయలేదు. దీంతో సదరు యువతికి కూడా ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో కష్టాలు తీరాలంటే డబ్బులు కావాలని, కిడ్నీ విక్రయిస్తే డబ్బులు వస్తాయని భావించి గూగుల్‌లో తీవ్రంగా సోదించింది. చివరికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు విక్రయించి వంచకుల అకౌంట్‌కు జమ చేసి నిలువునా మోసపోయింది. ఏటా పెరుగుతున్న సైబర్‌ నేరాలకు ఎప్పడు అడ్డుకట్టపడతాయో. చదవండి: విషాదం : మత్తు కోసం స్పిరిట్‌ తాగి ..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top