ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

CRPF Jawan Killed In Encounter With Maoists In Chhattisgarh - Sakshi

బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో గురువారం మావోయిస్టులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో.. ఒక జవాన్‌ మృతిచెందాడు. మృతి చెందిన జవాన్‌ను 151వ బెటాలియన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని తొంగుడా-పమేడ ప్రాంతంలో ఉదయం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కోబ్రా దళాలతోపాటు సీఆర్పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు.

ఈ క్రమంలోనే మావోయిస్టుల ఎదురుకాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో కొందరు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top