అర్ధరాత్రి ఆవుల అపహరణ | Cows Robbery In midnight Karnataka | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఆవుల అపహరణ

Aug 1 2018 12:03 PM | Updated on Aug 30 2018 5:27 PM

Cows Robbery In midnight Karnataka - Sakshi

ఆవులను తస్కరిస్తున్న దృశ్యం

కృష్ణరాజపురం: ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన సోమవారం రాత్రి కేఆర్‌పురం పరిధిలోని దేవసంద్రలో చోటు చేసుకుంది. దేవసంద్రలోని ఉర్దూ పాఠశాల సమీపంలో మునిరాజు, రత్న దంపతులు పాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజూ తరహాలోనే సోమవారం సాయంత్రం పాలను పితికి వాటిని రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో కట్టేశారు. మంగళవారం తెల్లవారేసరికి ఆవులు కనిపించలేదు. దీంతో కేఆర్‌ పురం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా  కొంతమంది వ్యక్తులు ఆవులను అపహరించిన దృశ్యాలు కనిపించాయి. ఫుటేజ్‌ల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement