పాపం కుక్క! నోట్లో నాటు బాంబు పెట్టుకుని.. | Country Bomb Kills Stray Dog In Suryapet | Sakshi
Sakshi News home page

పాపం కుక్క! నోట్లో నాటు బాంబు పెట్టుకుని..

Apr 25 2019 12:36 PM | Updated on Apr 25 2019 12:39 PM

Country Bomb Kills Stray Dog In Suryapet - Sakshi

తెలంగాణ శకుంతల పెంపుడు కుక్క నాటు బాంబును నోట్లో పెట్టుకుని...

సాక్షి, సూర్యపేట : ఒక్కడు’ సినిమా చూసిన వారికి.. కుక్క నాటుబాంబు నోట్లో పెట్టుకుని పరిగెత్తే సీను గుర్తుండే ఉంటుంది. ఆ సీన్లో తెలంగాణ శకుంతల పెంపుడు కుక్క బాంబును నోట్లో పెట్టుకుని, ఆమె వైపు పరిగెత్తుతుంది. ఆమె భయంతో దాని నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తూతూ ఓ ఇంట్లోకి వెళుతుంది. ఆ కుక్క కూడా ఆ ఇంట్లోకి దూరిన వెంటనే ఆమె తలుపులు మూయటం, బాంబు పేలటం. ఇది ఆ సీను. కొద్దిగా ఇలాంటి సంఘటనే సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వీధి కుక్క బాంబును నోట్లో పెట్టుకుని పరిగెత్తుకు వెళుతూ ప్రమాదానికి గురై మృత్యువాత పడింది.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఓ వీధి కుక్కకు ఓ నాటు బాంబు దొరికింది. ఏదో తినే వస్తువు అనుకున్న ఆ కుక్క దాని నోట కరుచుకుని పరిగెత్తింది. ఉత్సాహంతో దాన్ని గట్టిగా కొరికింది. అంతే బాంబు కాస్తా పేలి మరణించింది. ఊర్లో నాటు బాంబు కలకలం రేపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement