దొడ్డబళ్లాపురం : ఆ డ్రైవర్ రోడ్డు పక్కన కంటైనర్‌ను నిలుపుకుని దాబాలో భోజనం చేశాడు.. తర్వాత కంటైనర్‌లోనే నిద్రకు ఉపక్రమించాడు. ఇంతలో ఏమైందో గాని కంటైనర్‌కు మంటలు అంటుకుని డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని నెలమంగల పరిధిలోని 4వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన సురేంద్రకుమార్(35) ఈ ఖాళీ కంటెయినర్‌కు డ్రైవర్‌గా ఉన్నాడు. ఈ కంటైనర్‌ను దాబస్‌పేట నుండి కేరళ క్యాలికట్‌కు తీసుకెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి ఆలస్యం కావడంతో 4వ జాతీయ రహదారిపై దొడ్డేరి గ్రామం వద్ద హెచ్‌పీ డాబా సమీపంలో రోడ్డు పక్కన కంటైనర్‌ను నిలుపుకుని దాబాలో భోజనం చేసి వాహనం లోపలే నిద్రించాడు. అర్థరాత్రి ఏం జరిగిందోకానీ అకస్మాత్తుగా కంటైనర్ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే కాలిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే క్యాబిన్ అంతా కాలిపోయింది. అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కంటైనర్ హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉంది.
నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Dec 12 2017 5:07 PM | Updated on Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement