
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బంజారాహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో ఓ కానిస్టేబుల్ ఏకే 47 గన్‌తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రిటైర్డ్ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్‌మెన్‌గా కానిస్టేబుల్ కిషోర్ గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. శుక్రవారం తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకొని బలవన్మరణానికి యత్నించాడు. గన్‌ఫైర్ సౌండ్ విని తొలి అంతస్తులో ఉన్న ఆర్పీ మీనా, మరో ఇద్దరు గన్‌మెన్‌లు కిందికి వచ్చి అతన్ని హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.
బుల్లెట్ బయటకు పడిపోవడంతో ప్రాణపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కిషోర్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సంఘటనా స్థలిలో దొరికిన 7 పేజీల సూసైట్ నోట్ ద్వారా తెలుస్తోంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని ఏకే 47 గన్‌తో పాటు బుల్లెట్ల, సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.