breaking news
Gunmen fired
-
జడ్జి భార్య, కుమారుడిపై గన్‌మెన్ కాల్పులు
-
నీ భార్య, కొడుకును కాల్చేశా!
గురుగ్రామ్: ఓ న్యాయమూర్తి భార్య, కొడుకుపై కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్, అనంతరం ఆ జడ్జీకి ఫోన్ చేసి ‘నీ భార్య, కొడుకును కాల్చేశా’ అని చెప్పాడు. ఆతర్వాత పరారయ్యాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో కలకలం చెలరేగింది. హరియాణా పోలీస్‌శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న మహిపాల్ సింగ్ అదనపు సెషన్స్ జడ్జి కృష్ణకాంత్ శర్మ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఇంటికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాలని మహిపాల్ సింగ్ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. దీనికితోడు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులు మహిపాల్ సింగ్‌ను తరచూ దూషించేవారు. జడ్జి భార్య రీతూ, కొడుకు ధ్రువ్‌లు మహిపాల్‌తో కలిసి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు షాపింగ్ కోసం ఇక్కడి అర్కాడియా మార్కెట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కారులో రీతూ మరోసారి దూషించడంతో సహనం కోల్పోయిన మహిపాల్ మార్కెట్ వద్ద కారు దిగి∙సర్వీస్ రివాల్వర్‌ను బయటకు తీసి రీతూ, ధ్రువ్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. తర్వాత ధ్రువ్‌ను మళ్లీ కారులోకి తీసుకెళ్లబోయాడు. అయితే, కంగారులో ధ్రువ్‌ను అక్కడే పడేసి అదే కారులో పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో రీతూ ఆరోగ్యం స్థిరంగా ఉండగా, తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ధ్రువ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, కాల్పుల అనంతరం పరారైన హెడ్ కానిస్టేబుల్ మహిపాల్ సింగ్‌ను ఫరీదాబాద్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత రెండేళ్లుగా జడ్జి వద్ద పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సెలవులు ఇవ్వకపోవడం, వేధించడంతోనే మహిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మహిపాల్ స్వగ్రామం మహేంద్రగఢ్ అనీ, అతనికి ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. మహిపాల్ భార్య టీచర్‌గా పనిచేస్తోంది. -
హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం
-
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బంజారాహిల్స్‌లోని ప్రశాసన్ నగర్లో ఓ కానిస్టేబుల్ ఏకే 47 గన్‌తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రిటైర్డ్ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్‌మెన్‌గా కానిస్టేబుల్ కిషోర్ గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. శుక్రవారం తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకొని బలవన్మరణానికి యత్నించాడు. గన్‌ఫైర్ సౌండ్ విని తొలి అంతస్తులో ఉన్న ఆర్పీ మీనా, మరో ఇద్దరు గన్మెన్లు కిందికి వచ్చి అతన్ని హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్ బయటకు పడిపోవడంతో ప్రాణపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కిషోర్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సంఘటనా స్థలిలో దొరికిన 7 పేజీల సూసైట్ నోట్ ద్వారా తెలుస్తోంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని ఏకే 47 గన్‌తో పాటు బుల్లెట్ల, సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
దుండగుడి కాల్పులు: కానిస్టేబుల్‌కి గాయాలు
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో కచ్డోరా ప్రాంతంలోని బ్యాంకు వద్ద శుక్రవారం దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ సర్తాజ్ అమ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానిక జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వద్ద దుండగుడు కాల్పులు జరపడంతో జనం పరుగులు తీశారు.