రేప్‌ చేయించి.. తల నరికి.. రక్తం తాగారు.. | Congo Rebels Killed Woman Cruelly Infront of Crowd | Sakshi
Sakshi News home page

రేప్‌ చేయించి.. తల నరికి.. రక్తం తాగారు..

Published Wed, Oct 11 2017 8:29 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

Congo Rebels Killed Woman Cruelly Infront of Crowd - Sakshi

ల్యూబో : నడివీధిలో అందరూ చూస్తుండగా మహిళను జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి.. బట్టలు చించేసి వరుసకు కొడుకు(భర్త రెండో భార్య తనయుడు)తో రేప్‌ చేయించిన దారుణ ఘటన కాంగోలో చోటు చేసుకుంది. కాంగోకు చెందిన కమినా ఎన్‌సపూ రెబల్స్‌ ఈ ఘోరానికి ఒడిగట్టారు.

రక్త పిపాసుల్లా వారి తలలను నరికి నెత్తురు తాగారు. అనంతరం ఇరువురి మొండాలను ఊరి మధ్యలో వేలాడదీశారు. రెబల్స్‌ ఇలా ఆమెపై దాడికి దిగడం వెనుక పెద్ద కారణం ఉంది. కొద్ది రోజుల క్రితం ఆమె నడిపే రెస్టారెంట్‌కు వెళ్లిన రెబల్స్‌కు విషపూరితమైన చేపల మాంసాన్ని వడ్డించింది. దీంతో విషపూరిత ఆహారాన్ని తిన్న పలువురు రెబల్స్‌ మరణించారు.

తొలుత తోటి వారు ఎందుకు మరణించారో రెబల్స్‌ గ్రూపు నాయకుడు కబాటాకు అర్థం కాలేదు. కానీ, తన గూఢచారులతో జరిగిన విషయాన్ని తెలుసుకున్న అతను ఆగ్రహాంతో మహిళ, రెస్టారెంట్‌లో ఆమెకు సహకరించిన వ్యక్తి తల నరికి ఊరి నడిబొడ్డున వేలాడదీయాలని ఆదేశించాడు. ఇద్దరినీ ఈడ్చుకొచ్చిన రెబల్స్‌ గ్రూపునకు చెందిన వ్యక్తులు వారిని క్రూరంగా హింసించి చంపారు.

ఈ ఏడాది మార్చిలో కమినా ఎన్‌సపూ రెబల్స్‌ ల్యూబో పట్టణాన్ని తమ అదుపాజ్ఞాల్లోకి తెచ్చుకున్నారు. కాంగోలీస్‌ ఆర్మీ 20 రోజుల్లో రెబల్స్‌ను తోక ముడిచేలా చేసింది. అయితే ఈలోగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సైన్యం పట్టణాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునే రోజున నడి వీధిలో వేలాడుతున్న ఇద్దరి శవాలు దర్శనమిచ్చాయి.

శృంగారం, స్నానాలకు దూరం..!
కాంగో రెబల్స్‌పై పరిశోధనలు చేస్తున్న ఓ ప్రొఫెసర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కమినా ఎన్‌సపూ రెబల్స్‌ శృంగారంలో పాల్గొనరు, స్నానం చేయరు, మాంసం తినరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement