వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలపై ఫిర్యాదు | Complaint against Writings in Watsap | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలపై ఫిర్యాదు

Apr 26 2018 2:08 PM | Updated on Sep 2 2018 4:46 PM

Complaint against Writings in Watsap - Sakshi

నెల్లిమర్ల : తనపై సోషల్‌ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపించారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులపై ఓ యువతి నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌న్లో ఫిర్యాదు చేసింది. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటకు చెందిన ఆ యువతి, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణానికి చెందిన వి.సునీల్‌కుమార్‌ జరజాపుపేటకు చెందిన ఓ యువతి పట్ల అసభ్యకరంగా గోడపత్రికలు ముద్రించి, చెడుగా ప్రచారం చేశాడు.

వీటిని జరజాపుపేటలోని ఇళ్ల గోడలకు అంటించాడు. అలాగే మరో యువకుడు పి.పవన్‌కల్యాణ్‌ ఆ వాల్‌పోస్టర్లకు ఫోటోలు తీసి, వాటిని వాట్సాప్‌లో పోస్ట్‌ చేశాడు.  సదరు యువతి ఇరువురిపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం సునీల్‌కుమార్, పవన్‌కల్యాణ్‌లపై కేసు నమోదు చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement