తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం.. | Class Nine Student Allegedly Sodomised By Classmate | Sakshi
Sakshi News home page

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం..

Sep 25 2018 11:12 AM | Updated on Nov 9 2018 5:06 PM

Class Nine Student Allegedly Sodomised By Classmate - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ఢిల్లీ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది..తొమ్మిదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులు

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిపై తన క్లాస్‌మేట్‌ సహా ఇద్దరు బాలురు స్కూల్‌ ప్రాంగణంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది మే-జూన్‌లో పాఠశాల నిర్వహించిన సమ్మర్‌ క్యాంప్‌ సందర్భంగా తన క్లాస్‌మేట్‌ సహా వేరే సెక్షన్‌ విద్యార్థి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారని తూర్పు ఢిల్లీ డీసీపీ పంకజ్‌ సింగ్‌ చెప్పారు.

పాఠశాల భవనంలోని మూడో​ అంతస్తులో కంప్యూటర్‌ ల్యాబ్‌ పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి తనను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు లైంగికంగా వేధించారని విద్యార్థి ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఎవరికైనా ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి నిందితులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. జరిగిన విషయం తల్లితండ్రులకు చెప్పగా వారి చొరవతో బాలుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement