పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని... | Chennai Man Commits Suicide Over Wife Did Not Come | Sakshi
Sakshi News home page

పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని...

Nov 20 2019 9:00 AM | Updated on Nov 20 2019 9:01 AM

Chennai Man Commits Suicide Over Wife Did Not Come - Sakshi

సాక్షి, అన్నానగర్‌ : పుట్టింటికి  వెళ్లిన భార్య తనతో రాకపోవడంతో మనస్తాపం చెందిన నవవరుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. కళ్లకురిచ్చి సమీపంలోని కచ్చిరాయపాళ్యంకు చెందిన కాళియప్పన్‌ కుమారుడు ధనుష్కోటి (20)కి 5 నెలల క్రితం ఫేస్‌బుక్‌లో నామక్కల్‌కి చెందిన బెన్నీ (18)తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. గత నెలలో నామక్కల్‌లో ఉన్న ఓ చర్చిలో బెన్నిని పెళ్లి చేసుకున్నాడు. ఈ స్థితిలో బెన్ని తన భర్తతో గత వారం నామక్కల్‌లోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆమె అనారోగ్యానికి గురైంది. రెండు రోజుల తరువాత ధనుష్కోటి తన భార్యని సొంత ఊరుకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆమె ఆరోగ్యం కుదురుకున్నాక పంపిస్తామని అత్తింటి వారు చెప్పారు.

దీంతో మనస్తాపం చెందిన ధనుష్కోటి సోమవారం సాయంత్రం చిన్న సేలంకి వచ్చాడు. తండ్రి కాళియప్పన్‌కి ఫోన్‌ చేసి బెన్ని నాతో రాలేదు. ఆమె కన్నవారు మమ్మల్ని విడదీస్తారని అనుమానంగా ఉందంటూ వాపోయాడు. బెన్ని లేని జీవితం తనకు వద్దని, ఆత్మహత్య చేసుకోనున్నట్లు చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన కాళియప్పన్‌ బంధువులతో చిన్నసేలం, కచ్చిరాయపాలయంలో వెతికాడు. ఈ స్థితిలో చిన్న సేలం అమ్మయగరమ్‌ రోడ్డులోని రైల్వే పట్టాలపై ధనుష్కోటి శవంగా ఉన్నట్లుగా చిన్నసేలం రైల్వే పోలీసులకి సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement