ఇళ్ల పేరుతో ప్రధానోపాధ్యాయురాలి భారీ మోసం.. | Sakshi
Sakshi News home page

ఇళ్ల పేరుతో ప్రధానోపాధ్యాయురాలి భారీ మోసం..

Published Mon, Nov 27 2017 10:17 PM

Cheating Case filed against head mistress

సాక్షి, తిరువళ్లూరు: హౌసింగ్‌ బోర్డులో ప్లాట్లు ఇప్పిస్తానంటూ వంద మందిని కోట్ల రూపాయల్లో మోసం చేసిన ప్రధానోపాధ్యాయురాలిపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. చెన్నై అయపాక్కం ప్రాంతానికి చెందిన మేఖల తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్‌లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయపాక్కంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ హౌసింగ్‌ బోర్డులో ప్లాట్లను ఇప్పిస్తానని పాడి, మనలి, తిరువొత్తియూర్‌ ప్రాంతాలకు చెందిన 103 మంది వద్ద నుంచి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసింది.

అయితే ఇంత వరకు ప్లాట్లు ఇప్పించకపోగా, నగదును కూడా తిరిగి ఇవ్వడం లేదు. దీనిపై దాదాపు 50 మంది బాధితులు సోమవారం కలెక్టర్‌ సుందరవల్లికి వినతి పత్రం సమర్పించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తమ నగదును వాపసు చేయాలని కోరితే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని వారు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన  కలెక్టర్‌ వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement