బ్యూటీషియన్‌ను మాటల్లో దించి గొలుసు చోరీ | Chain Snatching In Rangareddy | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్‌ను మాటల్లో దించి గొలుసు చోరీ

May 29 2018 11:04 AM | Updated on May 29 2018 11:04 AM

Chain Snatching In Rangareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాజేంద్రనగర్‌ : బ్యూటీపార్లర్‌కు వచ్చిన ఓ మహిళ.. నిర్వాహకురాలిని మాటల్లోకి దింపి ఆరు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెక్రటేరియట్‌ కాలనీలో పద్మావతి అనే మహిళ సరిత బ్యూటీ పార్లర్‌ను నిర్వహిస్తుంది. సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ(30) బ్యూటీపార్లర్‌లోకి వచ్చింది.

ఈ సమయంలో పద్మావతి ఒంటరిగా ఉంది. తనకు మేకప్‌ చేయాలని కోరడంతో పద్మావతి ఆ మహిళకు మేకప్‌ చేయడం ప్రారంభించింది. ఇదే సమయంలో ఊరు, ఇతర కుటుంబ విషయాలు అడిగి బ్యుటీషియన్‌ పద్మావతిని మాటల్లోకి దింపింది.

ఆమె వెళ్లిన కొద్దిసేపటికి పద్మావతి మెడలో ఉన్న ఆరు తులాల బంగారు గొలుసు కనిపించకపొవడంతో లబోదిబోమంటూ స్థానికుల సాయంతో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మహిళ మాటల్లోనే మత్తు ఉందని ఆమె తనతో ఏం చేసిందో గొలుసు ఎలా తీసుకుందో తెలియడం లేదని పద్మావతి బోరుమంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement