హాస్యనటున్ని ప్రశ్నించిన సీసీబీ | CCB Police Interrogation To Comedian Sadhu Kokila | Sakshi
Sakshi News home page

హాస్యనటున్ని ప్రశ్నించిన సీసీబీ

Jul 10 2018 6:52 AM | Updated on Jul 10 2018 6:52 AM

CCB Police Interrogation To Comedian Sadhu Kokila - Sakshi

యశవంతపుర: రౌడీ సైకిల్‌ రవితో సంబంధాలపై పోలీసులు శ్యాండల్‌వుడ్‌ హాస్యనటుడు సాధుకోకిలను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు.ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రశ్నించారు. దీనిపై వివరాలను వెల్లడించటానికి సాధుకోకిల నిరాకరించారు. సైకిల్‌ రవికి సాధుకోకిల ఏడెనిమిదిసార్లు ఫోన్‌ చేసినట్లు కాల్‌ లిస్టులో తేలడంతో ఆయనను సీసీబీ పోలీసులు విచారించారు. కాల్‌ లిస్టు ఆధారంగా అనేకమందిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement