సినీనటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు | Case Registered Against Film Actress Radha Prasanthi | Sakshi
Sakshi News home page

సినీనటి రాధ ప్రశాంతిపై కేసు నమోదు

Jul 23 2020 8:55 AM | Updated on Jul 23 2020 11:23 AM

Case Registered Against Film Actress Radha Prasanthi - Sakshi

రాధా ప్రశాంతి ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: సినీనటి రాధ ప్రశాంతిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. శబ్దం వినిపించడంతో స్థానికంగా ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బయటికి వచ్చి చూడగా... రాధ ప్రశాంతితో పాటు ఉన్న మరో వ్యక్తి ఆ మహిళపై దాడి చేస్తుండగా తన మొబైల్‌లో చిత్రీకరించారు. దీంతో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మొబైల్ లాక్కొని ధ్వంసం చేసి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాధ ప్రశాంతితో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement