కారు స్వైరవిహారం: ఇద్దరు పిల్లలకు గాయాలు | car rash driving: two children injured | Sakshi
Sakshi News home page

కారు స్వైరవిహారం: ఇద్దరు పిల్లలకు గాయాలు

Jan 28 2018 11:50 AM | Updated on Aug 14 2018 3:25 PM

సాక్షి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో ఓ కారు స్వైరవిహారం చేసింది. ఇద్దరు పిల్లలను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. పిల్లలు గాయపడడంతో ఆ కారుని ఆపడానికి ప్రయత్నించిన రెండు వాహనాలను కూడా ఢీకొట్టి కారును నడుపుతున్న వ్యక్తి తప్పించుకుని వెళ్లిపోయాడు. పారిపోతున్న వాహనదారుడిని అశ్వారావుపేటలో స్థానికులు అడ్డగించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ గా గుర్తించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement