క్యాబ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం

Cab Driver And co Passenger Raped A Woman In Greater Noida - Sakshi

న్యూఢిల్లీ : క్యాబ్‌ బుక్‌ చేసుకున్న యువతిపై ఆ క్యాబ్‌ డ్రైవర్‌తో పాటు, తోటి ప్రయాణికుడు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ సెక్టార్‌ 126 నుంచి నోయిడాకు వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే అంతకుముందే ఆ కారులో వేరే ప్రయాణికుడు ఉండటంతో ఆమె అందులో వెళ్లేందుకు నిరాకరించారు. అతడు దగ్గర్లోనో దిగిపోతాడు అని డ్రైవర్‌ చెప్పడంతో నమ్మి ఆమె క్యాబ్‌ ఎక్కింది.

అయితే ఇదే అదనుగా భావించిన క్యాబ్‌ డ్రైవర్‌ కారును జర్చా అటవీ ప్రాంతానికి తరలించాడు. ఆమెకు బలవంతంగా మద్యం పట్టించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యాచారంతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top