శైలజ.. బీటెక్‌ దొంగ | Sakshi
Sakshi News home page

బీటెక్‌ దొంగ

Published Fri, Aug 17 2018 9:27 AM

Btech Student Arrest In Robbery Case Hyderabad - Sakshi

బోడుప్పల్‌: లేడీస్‌ హాస్టళ్లలో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఓ  బీటెక్‌ విద్యార్థినిని గురువారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా, కాచికుంట కాలనీకి చెందిన  శైలజ(19) బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతుంది. మూడు నెలల క్రితం చదువు మానేసిన ఆమె ఉప్పల్‌ రామాలయం వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. పీర్జాదిగూడ బుద్ధానగర్‌లో నాగరాజు అనే వ్యక్తి స్టైల్‌ ఆఫ్‌ శ్రీనిధి గరల్స్‌ పేరుతో లేడీస్‌ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు.

ఈ నెల 4న హాస్టల్‌లో చోరీ జరగడంతో అతను  మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం బుద్ధానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న శైలజను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించింది. ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో రూ 22.500 నగదు, బుద్ధానగర్‌లో రూ 40 వేల విలువైన ఐఫోన్‌ను దొంగలించినట్లు తెలిపింది. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement