స్నేహితులతో కలిసి లైంగికదాడికి పాల్పడ్డ అన్న

Brother Commited Sexual Assault On Sister In Pamuru, Prakasam - Sakshi

సాక్షి, పామూరు(ప్రకాశం) : తొమ్మిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన ఘటన బుధవారం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పామూరు మండలం కోడిగుంపల గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలిక తమ గ్రామానికి సమీపంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని వాగుకు బహిర్భూమికి వెళ్లింది.

ఈ సందర్భంలో బాలికకు అన్న వరసయ్యే అయ్యే యువకుడు జడ సునీల్‌ మాట్లాడాలంటూ బాలికను సమీపంలోని తెల్లరాయి క్వారీ వద్దకు తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోగా బాలిక వారించింది. అనంతరం యువకుడు గ్రామానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులు కొడవటికంటి బాబు, శేషం భానుప్రసాద్‌లకు ఫోన్‌ చేసి పిలిపించాడు. ముగ్గురూ ఆమెను బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించడంతో ఆమె ఇంట్లో కూడా విషయం చెప్పలేదు.

రోజూ యథావిధిగా పాఠశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మరలా 30వ తేదీ మంగళవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో అటకాయించారు. తమతో రావాలని, లేదంటే విషయం గ్రామంలో చెబుతామని బెదిరించారు. భయపడుతూ వడివడిగా పాఠశాలకు వెళ్లిన బాలికి ఇంటికి తిరిగి వచ్చాక విషయం తల్లితో చెప్పింది. బందువులతో కలిసి తల్లి బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా ఎస్సై అంబటి చంద్రశేఖర్‌ నిందితులు ముగ్గురిపై ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి కోరింది. నిందితుడు బాలికకు పరిచయస్తుడేనా..? నిందితుల్లో శేషం భానుప్రసాద్‌కు వివాహితుడు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు బేల్దారీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. కాగా జడ సునీల్‌తో బాలిక కొన్ని మాసాలుగా సన్నిహితంగా ఉంటున్నట్టు గ్రామస్తులు, చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఘటనపై సోమ, మంగళవారాల్లో గ్రామంలో రాజీ యత్నాలు జరిగినట్లు, ఘాతుకానికి పాల్పడ్డ వారిలో ఒకరిని వివాహానికి ఒప్పించే యత్నాలు చేయగా అవి బెడిసి కొట్టడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top