
అదృశ్యమైన సత్యవేణి(ఫైల్)
గత నెల 18న వివాహం చేశారు. అయితే శనివారం సత్యవేణి అదృశ్యమైంది.
విశాఖపట్నం, కె.కోటపాడు(మాడుగుల): నవవధువు అదృశ్యంపై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎ.కోడూరు ఏఎస్‌ఐ వీరభద్రరావు ఆదివారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన పట్నాల వీర్రాజు కుమార్తె సత్యవేణిని కొరువాడ గ్రామానికి చెందిన ములసాల ప్రసాద్‌కు ఇచ్చి గత నెల 18న వివాహం చేశారు. అయితే శనివారం సత్యవేణి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి పట్నాల కామేశ్వరి ఎ.కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ వీరభద్రరావు తెలిపారు.