కాళ్ల పారాణి ఆరకముందే... | Bride Commits Live Ends in Karnataka | Sakshi
Sakshi News home page

కాళ్ల పారాణి ఆరకముందే...

Jun 6 2020 6:36 AM | Updated on Jun 6 2020 6:36 AM

Bride Commits Live Ends in Karnataka - Sakshi

భావన (ఫైల్‌)

కర్ణాటక, మైసూరు : తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భరించలేని భార్య ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇక్కడి ఆనంద నగరకు చెందిన భావన (24) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భావనకు నెల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అజయ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు నుంచే అజయ్‌ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. (అక్కాచెల్లెలు అదృశ్యం.. )

ఆ మహిళకు చెందిన ఫొటోలు అజయ్‌ మొబైల్‌లో ఉండటం, ఇద్దరూ నగ్నంగా ఉన్న ఫొటోలు కనిపించడంతో భావన అజయ్‌ను నిలదీసింది. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దల వరకు వెళ్లింది. అనంతరం పెద్దలు ఇద్దరికి రాజీ కూడా చేశారు. అయినా కూడా భర్తలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర ఆవేదనతో శుక్రవారం ఉదయం భావన తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  (ప్రేమ.. పెళ్లి.. వేధింపులు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement