ప్రేమ.. పెళ్లి.. వేధింపులు!

Love Marriage Dowry Harassment And End Lives in Hyderabad - Sakshi

డబ్బులు తేవాలంటూ భర్త సాధింపులు

ఉరేసుకుని ఇల్లాలు బలవన్మరణం

మల్కాజిగిరి: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ హరీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్‌కు చెందిన సమీనాభాను (20), నేరేడ్‌మెట్‌కు చెందిన సాయిచరణ్‌ ప్రేమించుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా వీరు వసంతపురి కాలనీలో నివాసముంటున్నారు. సమీనాభాను మూడు నెలల గర్భిణి. ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న సాయిచరణ్‌ కొన్ని రోజులుగా డబ్బుల కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! )

మంగళవారం వీరి ఇంటి పక్కన ఉండే వారు సమీనాభాను సోదరి మెహ్రాభానుకు ఫోన్‌ చేసి ఆమె సూసైడ్‌ చేసుకుందని సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న సమీనాభానును కిందికి దించి సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడిని పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యుడు చెప్పారు. సాయిచరణ్‌ వేధింపుల కారణంగా సమీనాభాను మృతికి కారణమని ఆమె సోదరి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.(మధుర ఫలం.. చైనా విషం!)
(పెళ్లి ఒకరితో.. ప్రేమ మరొకరితో)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top