జువైనల్ హోం నుంచి 15 మంది పరార్ | Boys Escaped From A Juvenile Home In Hyderabad | Sakshi
Sakshi News home page

జువైనల్ హోం నుంచి 15 మంది పరార్

May 13 2018 8:05 PM | Updated on Sep 4 2018 5:44 PM

Boys Escaped From A Juvenile Home In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జువైనల్ హోం నుంచి 15 మంది బాలురు పరారయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జువైనల్ హోం అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైదాబాద్‌లోని జువైనల్ హోంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన బాలురు.. ఆపై గోడదూకి పక్కనే ఉన్న బస్తీలోకి ప్రవేశించినట్లు సమాచారం. కొందరు హోం నుంచి బయటకు వచ్చి ఓ బైకు మీదు వెళ్లిపోగా, మిగతావారు కాలినడకన వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు హోం నుంచి తప్పించుకున్న బాలురిని గుర్తించినట్లు తెలుస్తోంది. బాలుర కోసం సిటీలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement