నీటిసంపులో పడిన బాలుడు 

The Boy Fell Down In The Drain And Died - Sakshi

    ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు పట్టించుకోలేదని కుటుంబీకుల  ఆరోపణ 

    ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

మంచాల: ఇంటి పట్టునే ఆడుకుంటున్న ఓ బాలుడు సంపులో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కాగజ్‌ఘట్‌ గ్రామంలో చోటు చేసుకుంది.  స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కాగజ్‌ఘట్‌ గ్రామానికి చెందిన యార జంగ య్య, రజిత దంపతుల కుమారుడు సాయికుమార్‌(7) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కు టుంబ సభ్యులు బయటకు తీశారు. బాలుడు సృహాలోలేకపోవడంతో వెంటనే చికిత్స నిమి త్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌లు స్పం దించకపోగా.. కనీసం చెయ్యి పట్టుకొని నాడి కూడా పరిశీలించలేదు. కుమారుడు కళ్లు తెరవలేదనే ఆందోళనలో ఉన్న కుటుంబసభ్యులు ఆవేదనతో ప్రశ్నించినా పట్టించుకోలేదు.  
రెండు నిమిషాలు ముందొస్తే బతికించేవాళ్లం.. 
దీంతో చేసేదిలేక తిరిగి ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు రెండు నిమిషాలు ముందు బాలుడిని తీసుకొచ్చి ఉంటే బతికేవాడని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల రోధన మిన్నంటాయి. ఆగ్రహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వ ఆ స్పత్రి వైద్యుల  నిర్లక్ష్యంతోనే బాలుడి ప్రాణం పోయి ందని ఆరో పించారు. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top