బాలికపై అత్యాచారయత్నం...బీజేపీ నేత అరెస్ట్‌ | BJP Leader Arrested For Sexually Assauting Minor Girl In Kerala | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారయత్నం...బీజేపీ నేత అరెస్ట్‌

Apr 23 2018 5:10 PM | Updated on Mar 29 2019 9:07 PM

BJP Leader Arrested For Sexually Assauting Minor Girl In Kerala - Sakshi

సాక్షి, చెన్నై: రైల్లో ప్రయాణిస్తున్న ఓబాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువనంతపురం- చెన్నై ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని చెన్నైకి చెందిన న్యాయవాది కేపీ ప్రేమ్‌ అనంత్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్లో నిద్రిస్తున్న 10 ఏళ్ల బాలికపై అనంత్‌ లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు లేచి గట్టిగా అరవడంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి అనంత్‌ను పట్టుకున్నారు.

అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈరోడ్‌ రైల్వే పోలీసులు అనంత్‌ను అరెస్టు చేశారు. కేపీ ప్రేమ్‌ అనంత్‌ 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించే ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేసిన రోజే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం​.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement