‘బిర్యానీ అమ్మాడని చితకబాదారు’

UP Biryani Seller Abused Over His Caste Near Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. దళిత వ్యక్తి  బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బిర్యానీ విక్రయిస్తున్న దళితుడు లోకేష్‌ (43)ను కులం పేరుతో దూషిస్తూ కొందరు భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. శుక్రవారం ఈ ఘటన జరగ్గా వీడియో మాత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పలుసార్లు తాము హెచ్చరించినా అతను బిర్యానీ విక్రయిస్తున్నాడనే ఆగ్రహంతో వారు దళితుడిపై దాడికి తెగబడినట్టు స్ధానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనను ఖండిస్తూ నటి ఊర్మిళా మటోండ్కర్‌ ట్వీట్‌ చేశారు. భారతీయులుగా మనం అంటరానితనం పాటించడం మన సంస్కృతి కాదని, ఇది నాగరికం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. దళితునిపై దాడి ఘటన సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌ ఉద్దేశానికి విరుద్ధమని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top