జూబ్లీహిల్స్‌లో పట్టపగలే దారుణం.. | bike riders attacked by knife | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో పట్టపగలే దారి దోపిడీ..

Jan 4 2018 5:29 PM | Updated on Aug 30 2018 5:27 PM

bike riders attacked by knife - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే...ముగ్గురు దుండగులు కత్తులతో బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని టార్గెట్‌ చేసుకుని... వాహనంతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఈ సంఘటన గురువారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యాదగిరి మరో ఉద్యోగితో కలిసి... ఆఫీస్ పనిమీద జూబ్లీహిల్స్‌  వెళ్లాడు. ఒకరు షాపులోకి వెళ్లగా.... యాదగిరి బైక్ మీద బయట వేచి చూస్తున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు యాదగిరిని కత్తులతో బెదిరించడమే కాకుండా బైక్‌ మీద నుంచి కిందకు తోసేశారు. ఆ తరువాత.. గొంతుపై కత్తిపెట్టి.. పర్సు లాక్కున్నారు.

ఈ సందర్భంగా యాదగిరి దుండగులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దుండగులపై హెల్మెట్‌ విసిరికొట్టినా వదలకుండా ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి ఉడాయించారు.  జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస‍్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన జరుగుతున్నా అక్కడ ఉన్నవారు మాత్రం మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. అటుగా వచ్చిన కార్లు, టూవీలర్ మీద వున్న వ్యక్తులు కూడా చూస్తూ ఉండిపోయారే కానీ... ఏమీ చేయకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement