అఖిలప్రియ భర్త జులుం

Bhuma Akhila Priya Husband Obstructing AP Police - Sakshi

సాక్షి, హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ మరోసారి ఏపీ పోలీసులపై జులుం ప్రదర్శించారు. గణపతి కాంప్లెక్స్ లోని తన నివాసం వద్ద అనుచరులతో పోలీసుల విధులకు ఆటకం కలిగించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి వచ్చిన పోలీసులపై ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారు. కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. తమ విధులకు ఆటంకం కలిగించిన పవన్, బిన్నయ్య, చిన్నయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండు వారాల క్రితం గచ్చిబౌలిలో ఏపీ పోలీసులపై భార్గవరామ్‌ దౌర్జన్యం చేశారు. దీంతో ఏపీ పోలీసులు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లోనూ ఏ1 నిందితుడిగా ఉన్న భార్గవ్‌రామ్‌ను ప్రశ్నించేందుకు కొన్నిరోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: అఖిలప్రియ భర్తపై మరో కేసు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top