ఎట్టకేలకు పెళ్లికి ఒప్పుకున్న మోడల్‌

Bhopal Model Agree To Marry Her Lover After Hostage - Sakshi

భోపాల్‌ : దాదాపు 12 గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉన్న మోడల్‌ ఎట్టకేలకు వివాహానికి అంగీకరించారు. దీంతో కథ సుఖాంతమైంది. అయితే ఆమెను అపార్ట్‌మెంట్‌లో కొన్ని గంటలపాటు బంధించడంతో పాటు నాటు తుపాకీని కలిగి ఉన్నాడన్న కారణాలతో పోలీసులు ఆ మోడల్‌ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.

అసలేమైందంటే.. భోపాల్‌కు చెందిన 30 ఏళ్ల మోడల్‌,  ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ముంబైలో రోహిత్‌ సైతం మోడలింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ విషయం తెలుసుకున్న మోడల్‌ తల్లిదండ్రులు రోహిత్‌తో కూతురి పెళ్లికి నిరాకరించారు. దీంతో చేసేదేంలేక రోహిత్‌తో పెళ్లికి వెనకడుగు వేశారు. ఈ విషయంలో రోహిత్‌పై మోదల్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతడు కొంతకాలం జైలుశిక్ష అనుభవించి బయటకొచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు భోపాల్‌లోని మిస్రాడ్‌ ఏరియాలోని మోడల్‌ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం ఉదయం 6గంటల ప్రాంతంలో వెళ్లాడు రోహిత్‌. ఐదో అంతస్తులో నివాసం ఉంటున్న మోడల్‌ ఇంట్లోకి ప్రవేశించి డోర్‌ లాక్‌ చేశాడు.

చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ను కాపాడాలని భావించారు. అయితే మోడల్‌, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్‌ ద్వారా తెలిపారు రోహిత్‌. ఈ క్రమంలో 12 గంటలు గడిచిపోయాయి. పెళ్లి గురించి మరోసారి ఆరాతీయగా వివాహం చేసుకుంటానని ఆమె చెప్పారు. పెళ్లికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టాంప్‌ పేపర్‌ మీద సంతకాలు సేకరించాడు. ఇంట్లో నుంచి బయటకురాగానే రోహిత్‌తో పాటు మోడల్‌ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్‌ లోధా తెలిపారు.

ఇద్దరికీ పోలీసుల కౌన్సెలింగ్‌
మోడల్‌(30), ఆమె ప్రియుడు రోహిత్‌(30)కి కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరూ మేజర్లనీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చునని సూచించాం. అవసరమైతే చట్టపరంగా వారికి సహకారం అందిస్తామని చెప్పినట్లు వివరించారు. అయితే ఆ సమయంలో నాటు తుపాకీతో ఆమెను ఏమైనా బెదిరించాడా అనే కోణంలోనూ రోహిత్‌పై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top