నటుడిపై కేసు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు | Bhojpuri Actor Raja Chaudhary Was Arrested For Drunken brawl | Sakshi
Sakshi News home page

Jun 3 2018 1:53 PM | Updated on Aug 20 2018 4:44 PM

Bhojpuri Actor Raja Chaudhary Was Arrested For Drunken brawl - Sakshi

భోజ్‌పురి నటుడు, నిర్మాత రాజా చౌదరి మరోసారి వివాదంలో చిక్కారు. అతిగా మద్యం తాగి ఘర్షణకు దిగినందుకు ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం రాత్రి కాన్పూర్‌ సమీపంలో సినిమా యూనిట్‌, కొంత మందితో ఆయన గొడవకు దిగాడు. నోటికి వచ్చినట్టు తిట్లు తిట్టాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని కాన్పూర్‌ ఎస్పీ సంజీవ్‌ సుమన్‌ తెలిపారు. 

గతంలో రాజా చౌదరి, నటి శ్వేతా తివారి విడాకుల కేసు విషయంలో వార్తల్లోకెక్కాడు. 1998లో అతనితో పరిచయం, ప్రేమ, పెళ్లి.. ఆ తరువాత వేధింపులు తట్టుకోలేక 2007లో విడిపోయిన శ్వేత, 2011లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత శ్వేత మరో వ్యక్తి (అభినవ్‌ కొహ్లీ), రాజా తన ప్రేయసి(శ్వేతా సూద్‌)ను వివాహం చేసుకున్నారు. శ్వేత తివారి, రాజా చౌదరి బిగ్‌బాస్‌ షో ద్వారా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement