జాగ్రత్త.. ముగ్గులోకి దించి ముంచేస్తారు | beware with chain snachers | Sakshi
Sakshi News home page

ముగ్గులేస్తున్నారా.. అయితే జాగ్రత్త

Jan 11 2018 1:28 PM | Updated on Jul 6 2018 3:32 PM

beware with chain snachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రామాల్లోకంటే నగరాల్లో ముగ్గుల సందడి ఎక్కువైంది. తామంటే తామంటూ పోటీలు పడి వేస్తున్నారు. ఇక బహుమతులని చెబుతుండటంతో వారి ఆరాటానికి అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా సంక్రాంతి కావడంతో నలుగురికి తమను తాము గొప్పగా పరిచయం చేసుకోవాలనే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ముగ్గులేసేందుకు ముచ్చటపడుతున్నారు. ఈ పాయింట్‌ను దొంగలు క్యాచ్‌ చేసుకున్నారు. తమ బ్రెయిన్‌కు పదును పెట్టి, పోలీసుల కళ్లుగప్పి దర్జాగా దోపిడీలకు ప్రణాళిక రచించి వెంటనే అమల్లోకి తెచ్చారు.

కాలనీల్లోకి వెళ్లి సంక్రాంతి సందర్భంగా తాము ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, గెలిచినవారికి పెద్ద పెద్ద బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. వారి అసలు ప్లాన్‌ తెలియక ముచ్చటపడిన మగువలంతా అందంగా ముస్తాబై బయటకు రావడమే కాకుండా తమ నగలను కూడా నలుగురికి కనిపించేలా వేసుకొని ముగ్గులు వేసేందుకు రావడం మొదలైంది. అలా వచ్చి ముగ్గులో నిమగ్నమవగానే చైన్‌ స్నాచర్లను తమ చేతి వాటం చూపించడం మొదలుపెట్టారు. వరుసగా బైక్‌లపై వచ్చి వారి చైన్‌లు లాక్కెళ్లడం మొదలు పెట్టారు. ఇప్పుడు మియాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement