‘ఉత్తమ డ్రైవర్‌’ గా అవార్డు.. అంతలోనే విషాదం | Best Driver Award Winner Srinivas Died In Kondagattu Accident | Sakshi
Sakshi News home page

Sep 11 2018 9:54 PM | Updated on Sep 11 2018 9:54 PM

Best Driver Award Winner Srinivas Died In Kondagattu Accident - Sakshi

సాక్షి, జగిత్యాల : కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 57 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా దుర్మరణం పాలయ్యాడు. అయితే శ్రీనివాస్‌కు ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు దక్కింది. అయితే అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొడిమ్యాల మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement