అడ్డుకున్న పోలీసును చితకబాదారు..! | Auto Rickshaw Driver Beats Police Personal For Stopping Wrong Side Driving | Sakshi
Sakshi News home page

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ను అడ్డుకున్నందుకు..

Mar 27 2019 9:32 AM | Updated on Mar 27 2019 9:52 AM

Auto Rickshaw Driver Beats Police Personal For Stopping Wrong Side Driving - Sakshi

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తున్న ఆటోవాలాను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న ఓ పోలీసుపై..

పట్నా : ఆటవిక రాజ్యం అని గతంలో పేరుపడ్డ బిహార్‌లో మళ్లీ అలాంటి పరిస్థితులే దాపురించాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ రక్షకభటులకే రక్షణ లేకుండా పోయింది. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తున్న ఆటోవాలాను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న ఓ పోలీసుపై రౌడీయిజం చేశారు. ఆటోవాలా అతని స్నేహితులు దుర్భాషలాడుతూ సదరు పోలీస్‌ కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్‌లోని అఘోరియా చౌక్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, రౌడీ మూక తాట తీసేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement