అన్నదమ్ములపై మద్యం వ్యాపారి దాడి

Attack On Brothers - Sakshi

ఇద్దరికి తీవ్రగాయాలు

తేరువలి పంచాయతీలో ఘటన

రాయగడ :  మద్యం తాగేందుకు వచ్చిన ఓ ఇద్దరి అన్నదమ్ములపై మద్యం వ్యాపారి తన అనుయాయులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన జిల్లాలోని తేరువలి ప్రాంతం పరిధిలో ఉన్న డీపీ క్యాంప్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు అన్నదమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి... రాయగడ జిల్లాలోని తేరువలి గ్రామ పంచాయతీ గునాకల్‌ గ్రామానికి చెందిన మున్నా కడ్రక(25), సున్నా కడ్రక(22) అతని స్నేహితుడు సున్నా తాడింగి విదేశీ మద్యం తాగేందుకు తేరువలి ప్రాంతంలోని డీపీ క్యాంప్‌ వద్ద ఉన్న కమనామహానందియా సారాబట్టీకు వెళ్లారు.

మద్యం తాగి వీరు కేవలం రూ.500 మాత్రమే చెల్లించి మిగతా సొమ్మును ఏటీఎం నుంచి తీసి, తీసుకువస్తామని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం తేరువలి బ్రిడ్జిపై నుంచి ఏటీఎంకు వెళ్తున్న బాధితులపై వ్యాపారి తన అనుయాయులైన సుమారు 20 మందితో కలిసి దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు అన్నదమ్ములకు తీవ్రగాయాలవ్వగా, స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వైద్య సేవల నిమిత్తం క్షతగాత్రులను రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top