పీడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్‌ బంధువు అరెస్ట్‌ | Arvind Kejriwal's Relative Vinay Bansal Arrested In A Corruption Case | Sakshi
Sakshi News home page

పీడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్‌ బంధువు అరెస్ట్‌

May 11 2018 4:21 AM | Updated on Aug 17 2018 12:56 PM

Arvind Kejriwal's Relative Vinay Bansal Arrested In A Corruption Case - Sakshi

న్యూఢిల్లీ: ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) డ్రెయినేజీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మేనల్లుడిని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణ బాధ్యతలను రేణు కన్‌స్ట్రక్షన్స్‌ అనే కంపెనీ చేపట్టింది. సుమారు రూ.3.1 కోట్ల విలువైన పనులను పీడబ్ల్యూడీ అధికారులతో కుమ్మక్కై ఈ కంపెనీ నాసిరకంగా చేపట్టిందని ఏసీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేణు కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలో సీఎం మేనల్లుడు వినయ్‌ బన్సల్‌కు సగం వాటా ఉంది. వినయ్‌ బన్సల్‌ను గురువారం అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఢిల్లీ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించింది. çఆప్‌ను వేధించడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement