వెలుగులోకి మరో కుట్రకోణం!

Another conspiracy angle in YS Vivekananda Murder Case - Sakshi

రాత్రుల్లో కొత్త వ్యక్తులు తచ్చాడితే మొరిగే కుక్క హతం

ఇటీవల కొట్టిచంపిన గుర్తుతెలియని దుండగులు

అప్పట్లో ఉదాసీనంగా తీసుకున్న వైఎస్‌ వివేకానందరెడ్డి

హత్యోదంతం నేపథ్యంలో చర్చిస్తున్న అభిమానులు

సాక్షి ప్రతినిధి కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతం పథకంలో మరో కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వైఎస్‌ వివేకా ఇంటి పరిసరాల్లో ఉన్న ఓ కుక్కను గుర్తు తెలియని దుండగులు కర్రలతో కొట్టి చంపారు. ఇంటి ఆవరణ, రహదారి వైపు కొత్త వ్యక్తులు ఎవరైనా తచ్చాడితే రయ్యిన మొరుగుతూ వారిపైకి ఉరికేది. అటు వైపు కొత్త వ్యక్తులు వచ్చేందుకు సాహసం చేయలేని విధంగా పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల ఆ కుక్కను ఎవరో కొట్టి చంపారు.

అప్పట్లో వైఎస్‌ వివేకానందరెడ్డి ఊదాసీనంగా వ్యవహరించిన ఫలితమే ప్రాణాలు మీదకు తెచ్చిందా? అనే అనుమానాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా రెక్కీ నిర్వహించడం, లేదా పథకంలో భాగంగా హత్య చేసేందుకు వచ్చినవారిని కుక్క అడ్డగించడంతోనే అప్పట్లో చంపేశారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

జగన్‌ చిన్నాన్న దారుణ హత్య

మళ్లీ అదే తరహా కుట్ర..

వివేకానందరెడ్డి హత్య వెనక పెద్ద కుట్రే!

సీబీఐ విచారణ జరిపించాల్సిందే

రాజకీయం కోసం ఇంత కిరాతకమా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top