మహిళపై అమెజాన్‌ డెలివరీ బాయ్‌ అఘాయిత్యం

Amazon Delivery Boy Hypnotises Woman And Molested At Noida Fla - Sakshi

న్యూఢిల్లీ: అమెజాన్‌ డెలీవరీ బాయ్‌ ఒకరు తనను హిప్నటైజ్‌ చేసి.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారంటూ ఓ 43 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాధితురాలు నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ.. ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అమెజాన్‌లో ఓ బాక్స్‌ను ఆర్డర్‌ చేసింది. ఈ బాక్స్‌లో మరో ఐదు చిన్న బాక్స్‌లు వస్తాయి. అయితే కారణం తెలియదు కానీ ఆ వస్తువులను రిటర్న్‌ చేయాలని భావించింది. ఇందుకోసం అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేసి, రిటర్న్‌ రిక్వెస్ట్‌  పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అమెజాన్‌ డెలివరీ బాయ్‌ రిటర్న్‌ పెట్టిన వస్తువులను తీసుకునేందుకు గాను బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఐదు బాక్స్‌లను రిటర్న్ తీసుకెళ్లలేనని.. కేవలం నాలుగు బాక్స్‌లను మాత్రమే తీసుకెళ్తానని చెప్పాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది.

ఈ క్రమంలో బాధితురాలి సోదరి అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి డెలివరీ బాయ్‌ మీద ఫిర్యాదు చేసింది. దాంతో అమెజాన్‌ కంపెనీ, డెలివరీ బాయ్‌ను అక్కడి నుంచి వెళ్లి పోమ్మని చెప్పింది. ఈ నెల 9న మరో వ్యక్తి వచ్చి మొత్తం ఐదు బాక్స్‌లను కలెక్ట్‌ చేసుకుంటాడని బాధితురాలితో చెప్పింది. అనంతరం బాధితురాలి సోదరి బయటకు వెళ్లింది. ఈలోగా కిందకు వెళ్లిన డెలివరీ బాయ్‌ కాసేపటికే బాధితురాలి అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చి.. ఐదు బాక్స్‌లను తీసుకెళ్తానని చెప్పాడు. కానీ బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. కస్టమర్‌ కేర్‌ చెప్పిన దాని ప్రకారం బుధవారం మరో ఏజెంట్‌కే వాటిని ఇస్తానని చెప్పింది. ఇలా మాట్లాడుతుండగానే.. బాధితురాలు కళ్లు తిరిగి పడిపోయింది. స్పృహ వచ్చి చూసే సరికి తాను కింద పడిపోయి ఉన్నానని.. డెలివరీ బాయ్‌ ప్యాంట్‌ విప్పి తన ఎదురుగా నిల్చున్నాడని బాధితురాలు తెలిపింది.

దాంతో తాను సాయం కోసం అరిచానని.. కానీ ఆ సమయంలో తన ఇంట్లో, చుట్టుపక్కల ఎవరు లేరని పేర్కొంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి మాబ్‌కర్ర తీసుకువచ్చి డెలివరీ బాయ్‌ మీద దాడి చేశానని.. దాంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొంది. డెలివరీ బాయ్‌ తనను హిప్నటైజ్‌ చేసి, అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత ఈ విషయం గురించి తన సోదరితో చెప్పానని.. ఆమె ఎంట్రీ రిజస్టర్‌లో ఉన్న డెలివరీ బాయ్‌ నంబర్‌కు కాల్‌ చేసి అతను ఎక్కడి నుంచి వచ్చాడనే వివరాలు కనుక్కుందని చెప్పింది. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సదరు డెలివరీ బాయ్‌ మీద ఫిర్యాదు చేశామంది. దీని గురించి అమెజాన్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల భద్రతమే మా ప్రథమ ప్రాధాన్యం. ఈ ఆరోపణలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. వెంటనే సదరు డెలివరీ బాయ్‌ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top