వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!

All Set To Arrest Vamshi Krishna For Molesting A Girl In Vijayawada - Sakshi

నగ్న చిత్రాల కేసులో పోలీసుల యత్నం

ఆస్ట్రేలియాలో చదువుతున్న నిందితుడు

కోర్టులో వారెంట్‌కు పిటిషన్‌ దాఖలు

సీఐడీ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీకి కసరత్తు

సాక్షి, అమరావతి: ప్రేమ పేరుతో వంచించి.. యువతి నగ్న చిత్రాలను తీసి లొంగదీసుకున్న కేసులో సూత్రధారి వంశీకృష్ణ అరెస్టుకు విజయవాడ నగర పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో చదువుతున్న అతడిని నగరానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ పుట్టిన రోజు పార్టీలో పరిచయమైన యువతిని మాచవరంలో ఉంటున్న వంశీకృష్ణ మాయ మాటలతో లొంగదీసుకుని.. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నాడు. తరువాత అతడు ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాడు.

అతడు ఆ వీడియోలను ప్రస్తుతం అరెస్టు అయిన స్నేహితుడు జగదీష్‌కు పంపించాడు. అప్పటి నుంచి అమ్మాయిని జగదీష్‌ లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ దుర్ఘటన జరగడానికి కారకుడైన జగదీష్‌ స్నేహితుడు వంశీకృష్ణను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడని ఇక్కడికి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం ముందుగా జిల్లా కోర్టులో ఓపెన్‌ డేటెడ్‌ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. ఆ తరువాత సీఐడీ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగదీష్‌ వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్‌ను పోలీసులు విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాగే ఇంకా ఎవరినైనా బెదిరించి నగ్న చిత్రాలు తీశాడా? అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఆ ఫోన్‌ను సైబర్‌ ఫోరెన్సిక్‌కు పంపించే యోచనలో ఉన్నారు. వంశీకృష్ణ, జగదీష్‌లతోపాటు ఇంకా ఎవరైనా ఇలా వ్యవహరించారా కోణంలో పరిశీలిస్తున్నారు. వారిద్దరి స్నేహితుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వారి ద్వారా మరింత కూపీ లాగాలని యత్నిస్తున్నారు.   

చదవండి: ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top