అఖిలేశ్‌ మెడకు మైనింగ్‌ కేసు!

Akhilesh Yadav Under the Scanner in Illegal Sand Mining Case - Sakshi

14 చోట్ల సీబీఐ సోదాలు

నిందితుల్లో తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి చంద్రకళ

న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్‌ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ సీబీఐ విచారణ ఎదుర్కొనే చాన్సుంది. ఈ మేరకు నమోదైన కేసు వివరాల్ని సీబీఐ వెల్లడించింది. ఐఏఎస్‌ అధికారిణి బి.చంద్రకళ, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్‌ కుమార్‌ మిశ్రా, బీఎస్పీ నాయకుడు సంజయ్‌ దీక్షిత్‌ సహా మొత్తం 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి శనివారం సీబీఐ అధికారులు.. యూపీ, ఢిల్లీలో నిందితులకు చెందిన 14 చోట్ల సోదాలు నిర్వహించారు. 2012–16 మధ్య కాలంలో హమీర్‌పూర్‌ జిల్లాలో ఇసుక, కంకర లాంటి ఖనిజాల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్నది తాజా కేసులో ప్రధాన ఆరోపణ. 2012–17 మధ్య కాలంలో నాటి సీఎం అఖిలేశ్‌ 2012–13లో గనుల శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అందుకే ఆయన పాత్రపై సీబీఐ దృష్టిసారించే వీలుంది.

అక్రమంగా కాంట్రాక్టులిచ్చారు..
2012–14 మధ్య కాలంలో హమీర్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రకళ ఈ–టెండర్‌ నిబంధనల్ని ఉల్లంఘించి కాంట్రాక్టులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె అక్రమంగా కొత్త అనుమతులిచ్చారని, పాత వాటిని పునరుద్ధరించారని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు అనుమతిచ్చిన చంద్రకళ, ఇతర అధికారులు.. గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్‌కు ఎంపికై, యూపీ కేడర్‌ అధికారిగా నియమితులయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top