నేను జైలుకు పోతున్నా ! | Sakshi
Sakshi News home page

నేను జైలుకు పోతున్నా !

Published Sat, Feb 9 2019 12:01 PM

Actress Sandhya Husband Arrest in Murder Case - Sakshi

చెన్నై , పెరంబూరు: నేను జైలుకు పోతున్నా.. నేను జైలుకు పోతున్నా... ఏంటీ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉందా? ఒక సినిమాలో హాస్య నటుడు వడివేలు చేయని నేరానికి కావాలనే అరెస్ట్‌ అయ్యి పోలీస్‌ జీప్‌లో వెళ్తూ.. నేను జైలుకు పోతున్నా అంటూ అందరీకీ వినిపించేలా అరుస్తాడు. ఇప్పుడు ఆ ప్రస్థావన ఎందుకొచ్చిందంటే ఇటీవల సహాయ నటి సంధ్యను ఆమె భర్త, సినీ దర్శకుడు బాలకృష్ణన్‌ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణను తీవ్రం చేశారు. అతనికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒక సారి బాలకృష్ణన్‌ను విచారించిన పోలీసులు గురువారం మరోసారి ఆలందూర్‌ కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో న్యాయమూర్తి ఈ కేసులో మీపై నేరారోపణల గురించి తెలుసా? అని ప్రశ్నించగా తనకు తెలియదని బదులిచ్చాడు. దీంతో న్యాయమూర్తి 19వ తేదీ వరకూ రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు బాలకృష్ణన్‌ను పుళల్‌ జైలుకు తరలిస్తుండగా మీడియా వాళ్లు చుట్టిముట్టి బాలకృష్ణన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు ఆయన సంధ్యను హత్య చేయలేదని చెప్పాడు. ఈ కేసు మలుపు తిరగనుందా? అని పోలీసులను అడగ్గా.. వారు అలాంటిదేమీ లేదన్నారు. ఆయన భార్యను హత్య చేశాడనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. భార్య శరీర భాగాలు ఎక్కడ పడేశాడన్న వివరాలను చెప్పి, ఆ ప్రాంతాలను చూపించాడని తెలిపారు. అవసరం వచ్చినప్పుడు వాటిని కోర్టుకు అందిస్తామన్నారు.

కేకలు వేసిన బాలకృష్ణన్‌
కాగా బాలకృష్ణన్‌ను పల్లిక్కరన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి కోర్టుకు తీసుకెళుతుండగా నేను జైలుకు వెళ్తున్నాను అంటూ కేకలు పెట్టాడని తెలిపారు. దీంతో బాలకృష్ణన్‌ మతిస్థిమితం కోల్పోయాడా? అన్న అనుమానం కలుగుతోందని కొందరు అంటున్నారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement