అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రిమాండ్‌ | Accused of rape remanded | Sakshi
Sakshi News home page

అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రిమాండ్‌

Mar 20 2018 12:03 PM | Updated on Jul 23 2018 8:49 PM

Accused of rape remanded - Sakshi

నిందితుడిని చూపుతోన్న సీఐ శివలింగం

ములుగు(గజ్వేల్‌): మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ములుగు మండలం బహిలంపూర్‌ గ్రామానికి చెందిన యువకుడు కురుమ అయిలయ్యను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గౌరారం సీఐ శివలింగం తెలిపారు. సోమవారం ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీశైలంతో కలసి సీఐ మాట్లాడుతూ..ఈ నెల 14న రాత్రి 10 గంటలకు అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల వయస్సు గల ఓ మైనర్‌ బాలిక తన చిన్నాన్న ఇంటికి వెలుతుంది.

ఇది గమనించిన అయిలయ్య వెనుకాల నుంచి వెళ్లి బాలిక నోరు మూసి పక్కనే వున్న ఓ పాడుబడిన ఇంటిలోకి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న ఆమె సోదరుడు ఘటనా స్థలానికి వచ్చి అయిలయ్యను పట్టుకోవడానికి యత్నించగా చేతిని కొరికి పారిపోయాడు. పరారీలో వున్న నిందితుడు అయిలయ్యను సోమవారం బహిలంపూర్‌లో అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement