చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌ | Accused arrested in theft case | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

Mar 5 2018 8:00 AM | Updated on Mar 5 2018 8:00 AM

Accused arrested in theft case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొడవలూరు: మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌లోని బంగారు, వెండి నగలు చోరీ చేసిన కేసులో నిందితుడైన బిట్రగుంటకు చెందిన గుర్రంకొండ రాజేష్‌ అలియాస్‌ బుడ్డను ఆదివారం కొడవలూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలిలా ఉ న్నాయి. తిరుపతికి చెందిన స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై సూర్యనారాయణ కుటుం బసభ్యులతో కలిసి జనవరి 23వ తేదీన గుంటూరుకు వెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించి తిరిగి తిరుపతికి వస్తూ రాత్రి కావడంతో కమ్మపాలెం వద్ద కారును ఆపి నిద్రకు ఉపక్రమించారు.

సూర్యనారాయణ భార్య హ్యాండ్‌ బ్యాగ్‌ను నిందితుడు దొంగిలించి అందులో ఉన్న బంగారు చైన్, వెంకటేశ్వరస్వామి డాలర్, రెండు జతల వెండి కాళ్ల పట్టీలు అపహరించాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు గుర్రంకొండ రాజేష్‌ అని నిర్ధారిం చారు. ఆదివారం కోవూరు బస్టాండ్‌లో ఉన్న అతడిని అరెస్ట్‌ చేశారు. బంగా రు, వెండి నగలను స్వాధీనం చేసుకోవడంతోపాటు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ జీపీపీ రామరాజు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement