కొశాగుమడ బాలిక హత్య కేసులో..నిందితుల అరెస్ట్‌

Accused Arrest in Girl Murder Case Odisha - Sakshi

ఒడిశా, జయపురం: నవరంగపూర్‌ జిల్లాలోని కొశాగుమడలోని గుముండల గ్రామ బాలిక హత్య సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు బాగా వినిపించాయి. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, బాలికపై ఎవరూ లైంగి కదాడి చేయలేదని, కేవలం హత్య మాత్రమే చేశారన్న విషయం బయటపడింది.

ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం ఇద్దరు నింది తులను అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో కొరాపుట్‌ జిల్లాలోని కొట్‌పాడ్‌ సమితిలో ఉన్న పొనకగుడ గ్రామవాసి ఖాడి భొత్ర(18), గుముండల గ్రామానికి చెందిన బొలి మఝి(20) ఉన్నారు. ప్రస్తుతం నిందితులను కోర్టుకు తరలించినట్లు నవరంగపూర్‌ ఎస్‌పీ నితిన్‌కుశలాకర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన 20రోజులైనా నిందితులను పట్టుకోవడంలో విఫలమైన పోలీ సుల తీరుకు నిరసనగా కొ«శాగుమడ క్రిస్టియన్‌ సమాజ్‌ శనివారం చేపట్టాలనుకున్న బంద్‌ విరమించుకున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top