లెక‍్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB raids on Telangana Lecturers JAC President House  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జూనియర్‌ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి నివాసంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మలక్‌పేటలోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, వికారాబాద్‌ సహా మొత‍్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు మధుసూదన్‌రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మధుసూదన్‌ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకూ జరిపిన సోదాల్లో సుమారు రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సాయంత్రం వరకూ సోదాలు కొనసాగనున్నాయి. మరోవైపు వికారాబాద్‌లో న్యాయవాది సుధాకర్‌ రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు జరుపుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top