ఆప్‌ నేత ప్రాణం తీసిన అసహజ బంధం

AAP Leader Burnt Alive In Car Was Drugged, Robbed And Murdered Allegedly By Partner - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆప్‌ నేత నవీన్‌ సజీవ దహనం కేసులో మిస్టరీ వీడింది. బాధితుడిని తన స్నేహితుడే కిడ్నాప్‌ చేసి డ్రగ్స్‌ తీసుకునేలా ప్రేరేపించి దారుణంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు బాధితుడితో స్వలింగ సంపర్కం చేసేవాడని ఘజియాబాద్‌ పోలీసులు వెల్లడించారు. బాధితుడికి ప్రధాన నిందితుడు తయ్యాబ్‌తో హోమో సెక్సువల్‌ సంబంధం ఉందని, దీన్ని కొనసాగించేందుకు తనతో ఫ్లాట్‌లో కలిసి ఉండాలని కోరాడని పోలీసులు చెప్పారు.

తయ్యాబ్‌ ఇందుకు నిరాకరించడంతో గతంలో తాము కలిసిఉన్న వీడియోను బహిర్గతం చేస్తానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడన్నారు. ఆప్‌ నేతను వదిలించుకునేందుకు ఘటన జరిగిన రోజు రాత్రి లోని ప్రాంతానికి అతడిని పిలిపించిన తయ్యాబ్‌ నిద్ర మాత్రలు కలిపిన హల్వాను తినిపించారు.బాధితుడు మత్తులోకి జారుకున్న వెంటనే అతడి వద్ద నుంచి రూ 7.85 లక్షల నగదును దోచుకున్నారని పోలీసులు తెలిపారు. బాధితుడు నవీన్‌ కుమార్‌ దగ్ధమైన మృతదేహాన్ని ఆయన కారులో లోని-బోప్రా రోడ్డులో గుర్తించిన కుటుం సభ్యులు ఘజియాబాద్‌లోని సహిదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top