ఆ పనికి అడ్డు తగిలిందని.. ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌ | 7years old girl kidnapped in srikakulam | Sakshi
Sakshi News home page

ఆ పనికి అడ్డు తగిలిందని.. ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌

Feb 2 2018 9:44 PM | Updated on Sep 2 2018 4:52 PM

7years old girl kidnapped in srikakulam - Sakshi

కిడ్నాప్‌కు గురైన చిన్నారి... పక్క చిత్రంలో నిందితుడు సురేష్‌

సాక్షి, శ్రీకాకుళం : తన అక్రమ సంబంధానికి అడ్డుతగిలిందనే నెపంతో ఓ కామాంధుడు ఓ మహిళ మనుమరాలును కిడ్నాప్ చేసిన సంఘటన శ్రీకాకుళంలో కలకలం సృష్టించింది. తనతో ఆమెను పంపించకపోతే ఆ పసిప్రాణాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు..

వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్‌ కలకలం రేపింది. లంకపల్లి సురేష్‌ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దికాలంపాటు గుట్టుగా సాగింది. వీరిద్దరి మధ్య దండి పార్వతి అనే మహిళ మద్యవర్తిత్వం వహించింది. కొద్ది రోజుల తర్వాత తప్పు తెలుసుకున్న పార్వతి, సురేష్‌ చేసే పని తప్పంటూ వారించింది. దీంతో పార్వతికి, సురేష్‌కు వివాదాలు వచ్చాయి. సదరు మహిళ సైతం సురేష్‌కు దూరంగా ఉంటోంది. ఈ విషయమై ఇరువురి మధ్య కొంత కాలంగా గొడవలు వస్తున్నాయి.

దీంతో పార్వతిపై కోపం పెంచుకున్న సురేష్‌ పార్వతి మనుమరావలు ఏడేళ్ల దండి శరణ్యను కిడ్నాప్‌ చేశాడు. మహిళను తనతో పంపిస్తేనే బాలికను విడిచపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో పార్వతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement