ఘోర ప్రమాదం : గ్రానైట్ లారీ, టాటా మ్యాజిక్ డీ..! | 5 Died In Horrible Road Accident In Karimnagar District | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురు మృతి

Feb 9 2020 7:42 AM | Updated on Feb 9 2020 8:29 AM

Road Accident In Jagtial District - Sakshi

ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ఉన్న ఐదుగురు మృతి చెందారు.

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ, టాటా మ్యాజిక్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మృతులు కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మృతులు మేకల నర్సయ్య అతని కుమారుడు మేకల బాబు, సొదరుడు బానయ్య, సోదరుని కుమారుడు శేఖర్, మేనల్లుడు ఆటో డ్రైవర్ గడ్డం అంజయ్యగా పోలీసులు గుర్తించారు. కాగా ఇటీవల బైక్‌పై నుంచి పడి గాయపడ్డ బాబుకు కరీంనగర్ ఆసుపత్రిలో వైద్యం చేయించి ఆటోలో ఇంటికి తీసుకు వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ జరిందని పోలీసులు పేర్కొన్నారు. ఆటో క్యాబిన్‌లో డ్రైవర్ అంజయ్య మృతదేహం ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement