చిన్నారిపై బాలుడి అఘాయిత్యం

4 Year Old Girl  Raped By Minor In warangal - Sakshi

నెక్కొండ(నర్సంపేట) వరంగల్‌ : అభం, శుభం తెలియని ఓ చిన్నారిపై ఆటలాడిస్తానంటూ నమ్మబలికి ఓ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ శివారు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు అదే తండాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటికి తరచూ వస్తుంటారన్నారు. బాలిక తండ్రి బట్టల వ్యాపారం చేసేందుకు వెళ్లగా, ఆమె తల్లి వ్యవసాయ పనులకు వెళ్లింది.

ఈ క్రమంలో ఈ నెల 17న ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు వచ్చి తండా సమీపంలోని ఓ గుడి వద్దకు బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు.  అనంతరం ఇంటికి వచ్చిన తండ్రి ఏ డ్చుకుంటూ ఉన్న బాలికను గమనించి వ్యవసా య పనులకు పోయిన తల్లి దగ్గరకు తీసుకువెళ్లా డు. దీంతో కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో జరిగిన విషయాన్ని గమనించింది.

పెద్ద మనుషులు జోక్యం చేసుకొని బాలుడి కుటుంబ సభ్యుల ను నిలదీశారు. పెద్ద మనుషుల సలహాతో సోమవారం చిన్నారి తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగు చూసింది. దీంతో ఏసీపీ సునీతామోహన్‌ తండాకు చేరుకొని దర్యాప్తు చేసి, చిన్నారిని వైద్య పరీక్షలకు పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top