వెంటపడ్డ విద్యార్థులపై చార్జ్‌షీటు

4 Students Booked For Stalking Smriti Irani - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మద్యం సేవించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ వర్సిటీ విద్యార్థులపై సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో విమానశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న ఇరానీని నలుగురు వెంబడించారు. దీంతో పోలీసులకు ఫోన్‌ చేసిన స్మృతి, తనను కొందరు యువకులు వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించగా వారందరూ మద్యం సేవించినట్లు తేలింది. రిపోర్టుల నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసులు చార్జ్‌షీటు దాఖలు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top